తెలంగాణకు మరోభారీ పరిశ్రమ : కేటీఆర్

తెలంగాణకు మరోభారీ పెట్టుబడి వస్తుందన్నారు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ప్రస్తుతం రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ భారీ విస్తరణ ప్రణాళికలు ప్రకటించిందన్నారు. మంచిర్యాల జిల్లా దేవాపూర్ లో సీకే బిర్లా గ్రూపు సుమారు 2 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణకు సిద్ధంగా ఉందన్నారు మంత్రి. దీనికి సంబంధించి శనివారం (జూలై-21) కేటీఆర్ ను కలిశారు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్, CEO దీపక్ ఖేత్రపాల్. విస్తరణతో 4 వేల మందికి ప్రత్యక్షంగా… మరో 8 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. పర్యావరణ శాఖ తుది అనుమతులు వచ్చిన తర్వాత 4 నెలల్లోగా ప్లాంట్ విస్తరణ చేపడతామన్నారు

Posted in Uncategorized

Latest Updates