తెలంగాణతో సెంట్రల్ ఫుడ్ రీసెర్చ్ సంస్థ ఒప్పందం

POCHARAMతెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తుల నుంచి వ్యాల్యు యాడెడ్ ప్రోడక్ట్స్ తయారుచేసేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్జనాన్ని అందించేందుకు.. సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇనిస్ట్యూట్ అంగీకారం తెలిపింది. తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ఓకే చెప్పింది. మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర బృందం మంగళవారం (జూన్-12) మైసూర్ లోని CFTRI కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది. CFTRI లోని పలు ఉత్పత్తుల తయారీ, నిల్వ, మార్కెట్ అవకాశాలను పరిశీలించింది.

ఈ క్రమంలోనే వ్యవసాయ, ఉద్యానపంటల ఉత్పత్తుల నుంచి ఉప ఉత్పత్తుల తయారీకోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు సానుకూలత వ్యక్తంచేసింది. వ్యవసాయ, ఉద్యాన పంటల నుంచి బైప్రొడక్ట్స్ తయారీలో CFTRIకి మంచి పేరున్నది. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఒక ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్.. వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటుచేశారు. మంత్రి పోచారం నేతృత్వంలో రాష్ట్ర బృందం ఒకరోజు పర్యటనలో భాగంగా మంగళవారం మైసూర్‌లోని CFTRI కేంద్ర కార్యాలయాన్ని సందర్శించింది.

CFTRI కార్యాలయానికి చేరుకున్న రాష్ట్ర బృందానికి CFTRI అధికారులు కన్నడ సంప్రధాయ పద్దతులలో ఘనంగా స్వాగతం పలికారు.  మొదట పైలెట్ ప్లాంట్ ను సందర్శించిన బృందం అక్కడ దోశ, చపాతి, ఇడ్లీని యంత్రాల ద్వారా తయారు చెసే విధానాన్ని పరిశీలించారు. వేరుశనగ విత్తనాలను వేయించే, ప్యాకింగ్ చెసే యంత్రం ప్రత్యేకతను అధికారులు వివరించారు. మొక్కజొన్న నుండి బిస్కెట్లు, కుకీస్, పౌడర్ వంటి ఉత్పత్పుల తయారు, ప్యాకింగ్ ను పరిశీలించారు. తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నారని, ఈ క్రమంలోనే మనరాష్ట్రంతో CFTRI ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి.

 

Posted in Uncategorized

Latest Updates