తెలంగాణను సీడ్ హబ్ గా మారుస్తాం: పోచారం

తెలంగాణను సీడ్ హబ్ గా మారుస్తామన్నారు అగ్రికల్చర్ మినిస్టర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. నాణ్యమైన విత్తనాలు ఇస్తే.. రైతులకు మంచి ఫలితాలు వస్తాయన్నారు. విత్తన ఉత్పత్తికి తెలంగాణలో మంచి వాతావరణం ఉందన్నారు. ఇండో-జర్మన్ సీడ్ సెక్టార్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్నారు పోచారం. రాష్ట్రంలో 4వందల విత్తన ఉత్పత్తి సంస్థలు ఉన్నాయన్నారు. దేశంలో 60శాతం మందికి తెలంగాణ నుంచే విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. రైతులకు న్యాయమైన, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ విత్తనాలు ఎగుమతి కావాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి పోచారం.

 

Posted in Uncategorized

Latest Updates