తెలంగాణలోనే అభివృద్ధి ఎక్కువ: కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర వృద్ధి దేశ సగటు కంటే 10.4 శాతం ఎక్కువగా ఉందన్నారు మంత్రి కేటీఆర్. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన గ్రూప్స్‌ను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇవాళ (అక్టోబర్-8) హైదరాబాద్‌లోని సెస్ ఆడిటోరియంలో జరిగిన ఇన్‌క్లూజివ్ డెవలప్‌మెంట్ ఇష్యూస్, చాలెంజెస్ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ అండ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైస్ నిర్వహించింది. ఈ ప్రోగ్రామ్‌కు RBI మాజీ గవర్నర్ వైవీరెడ్డీ, ఆర్థిక వేత్త హనుమంతారావు, ప్రొఫెసర్ రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు.

Posted in Uncategorized

Latest Updates