తెలంగాణలో కాకాది మరువలేని స్థానం.. పొన్నం ప్రభాకర్

కరీంనగర్:  కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి వెంకటస్వామి(కాకా) 89వ జయంతి వేడుకలు నిర్వహించారు.  వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, డీసీసీ ప్రెసిడెంట్ కటకం మృత్యుంజయం, ఎస్సీ సెల్ నేతలు.

కేంద్ర, రాష్ట్ర రాజకీయాల్లో, తెలంగాణ పోరాటంలో వెంకటస్వామిది ప్రత్యేక, చిరస్మరణీయ స్థానం అని చెప్పారు పొన్నం ప్రభాకర్. తెలంగాణ రాష్ట్రం చూశాకే చనిపోతానంటూ తనకు, వివేక్ కు వెంకటస్వామి తరుచూ చెప్పేవారన్నారు. తెలంగాణ సాధన పోరాటంలో ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చేవారన్నారు.

బలహీన వర్గాల గురించి, కార్మికులు, రైతులు సంక్షేమం గురించి కాకా తమకు అనేక విషయాలు చెప్పేవారని గుర్తుచేసుకున్నారు పొన్నం ప్రభాకర్. కాకా మన మధ్య లేకపోయినా ఆయన స్ఫూర్తి మిగిలే ఉందనీ.. వెంకటస్వామి జన్మ అపురూపమైనదన్నారు.

Posted in Uncategorized

Latest Updates