తెలంగాణలో టఫేవారి జేఫామ్‌

tractorట్రాక్టర్ల తయాను చేసే కంపెనీ ట్రాక్టర్స్‌ అండ్‌ ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ లిమిటెడ్‌ (టఫే) తెలంగాణలో హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతుంది. హై ప్రెసిషన్‌ ఇంప్లిమెంట్స్‌తో తక్కువ నీటి వినియోగం, తక్కువ ఎరువు వాడకం, విత్తనాలు, మొక్కలు సరైన రీతిలో నాటేందుకు వీలవుతుంది. ఈ కేంద్రాన్ని రూపొందించే విషయంపై టఫేతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో సైతం జేఫామ్‌ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది కంపెనీ. 50 హెక్టార్ల స్థలం సమకూర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది ఆ కంపెనీ. 30 సంవత్సరాల తర్వాత ఈ స్థలాన్ని ప్రభుత్వానికి వెనక్కి ఇస్తామన్నారు టఫే ప్రొడక్ట్‌ స్ట్రాటజీ ప్రెసిడెంట్‌ టి.ఆర్‌.కేశవన్‌. తెలంగాణలో ఎఫ్‌2ఎఫ్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెస్తామన్నారు. అద్దెకు ట్రాక్టర్లు, వ్యవసాయ యంత్రాలు కావాల్సిన వారు ఈ పోర్టల్‌ ద్వారా సేవలు పొందవచ్చునని ఆయన తెలిపారు. ఈ యూనిట్‌ కార్యరూపంలోకి వస్తే భారత్‌లో టఫేకు ఇది తొలి కేంద్రం అవుతుంది. ఈ యంత్రాల తయారీ యూనిట్‌ కోసం తొలుత రూ.200 కోట్ల వరకు పెట్టుబడి అవసరమన్నారు కేశవన్‌. విదేశీ కంపెనీల సహకారంతో వీటిని భారత్‌లో తయారు చేస్తామన్నారాయన.

ఉచితంగానే రైతులకు సేవలు

తమిళనాడు, రాజస్థాన్‌లో టఫే జేఫామ్స్‌ను నిర్వహిస్తోంది. ఇక్కడ విత్తన పరిశోధన చేస్తారు. తక్కువ రోజులకు పంట చేతికొచ్చే కూరగాయలు, ఔషధ మొక్కల పెంపకంపై  రైతులకు శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తారు. అవసరమైన వ్యవసాయ పరికరాలను అభివృద్ధి చేస్తారు. టఫే కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద జేఫామ్‌ సేవలన్నీ రైతులకు ఉచితంగానే అందిస్తోంది.

Posted in Uncategorized

Latest Updates