తెలంగాణలో డిజిటల్ ఇండియాకు నిధులు విడుదల చేశాం : మనోజ్ సిన్హా

తెలంగాణలో డిజిటల్ ఇండియాకు కావాల్సిన నిధులు విడుదల చేశామని చెప్పారు.. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి మనోజ్ సిన్హా. ఇంటర్నెట్ సేవలు విస్తరించేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. గ్రామాల్లో ఇంటర్నెట్ సేవలు విస్తరించకుండా డిజిటల్ ఇండియా సాధ్యం కాదన్న ఎంపీ బూర నర్సయ్య ప్రశ్నకు.. సమాధానమిచ్చారు మనోజ్ సిన్హా. డిజిటల్ ఇండియాలో భాగంగా దేశవ్యాప్తంగా స్కూళ్లు, హాస్పిటళ్లు, అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అనుసంధానం చేస్తున్నామని చెప్పారు.

దేశంలో బ్రాడ్ బ్యాండ్ సేవలు మరింత విస్తరిస్తున్నామన్నారు. చెన్నై కేంద్రం నుంచి అండమాన్ నికోబార్ దీవులతోపాటు మరో నాలుగు దీవులకు ఆప్టిక్ ఫైబర్ కేబుల్ సేవలు కల్పించేందుకు టెండర్లు పిలిచామని చెప్పారు కేంద్ర మంత్రి.

Posted in Uncategorized

Latest Updates