తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షం

hyd rainతెలుగు రాష్ట్రాల్లో నైరుతిప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. పలుచోట్ల ఆదివారం ( జూన్-10) మోస్తరు వర్షాలు కురిశాయి. రుతుపవనాల ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడొచ్చంటున్నారు అధికారులు. సాయంత్రం సమయంలో హైదరాబాద్  శివార్లలో వాన దంచికొట్టింది. నైరుతీ ఎఫెక్టుతో దేశం మొత్తంలో జోరువానలు పడుతున్నాయి.

నిన్నా మొన్న వర్షబీభత్సంతో వణికిన ముంబై మహానగరంలో  పరిస్థితి కాస్త మెరుగుపడింది. వర్షం లేకపోవడంతో వరదలు కూడాలేవు. ఉత్తర భారతంలో చాలాచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాఖండ్ లో వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి.

రాష్ట్రంలోనూ చాలాచోట్లవర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు, కేసముద్రం మండలాలు, కొమురం భీమ్, సిర్పూర్ కాగజ్ నగర్, వరంగల్ రూరల్, అర్బన్, యాదాద్రి భువనగిరి జిల్లాలో చాలాచోట్ల వర్షాలు పడ్డాయి.

సాయంత్రం తరువాత హైదరాబాద్ లో చాలాచోట్ల వర్షం కురిసింది. శివారు ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. శంషాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లపై నీరు భారీగా నిలిచింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఇక రాష్ట్రంలో హైదరాబాద్ లో అత్యధికంగా 36 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. ఖమ్మం, మెదక్ లో 35, నిజామాబాద్, రామగుండంలో 34, భద్రాచలంలో అత్యల్పంగా 32 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Posted in Uncategorized

Latest Updates