తెలంగాణలో మళ్లీ TRSదే గెలుపు: మమతా

mamata-trs2019 ఎన్నికల్లో తెలంగాణలో TRS మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఖాయమని తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా అని మమతా బెనర్జీ తేల్చి చెప్పారు. మంగళవారం (మార్చి-27) మమతా బెనర్జీ ఢిల్లీలో పలు పార్టీల నేతలతో సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ..తమిళనాడులో డీఎంకే, తెలంగాణలో TRS అధికారంలోకి వస్తాయని చెప్పారు. BJPని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీలన్నీ ఐక్యంగా ఉండాలని సూచించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని కోరారు. ప్రాంతీయ పార్టీల కూటమిలో NDAలోని పార్టీలు కూడా చేరుతాయని మమతాబెనర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Posted in Uncategorized

Latest Updates