తెలంగాణలో రాహుల్ టూర్ షెడ్యూల్

హైదరాబాద్ : ఎలక్షన్స్ టైం దగ్గరపడుతుండటంతో రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. ఎవరికివారు తమ ప్రచారం జోరు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే AICC  జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణ టూర్ ఫిక్స్ అయ్యింది. అక్టోబర్ – 20న ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

20వ తేదీ ఉదయం 10.30నిమిషాలకు శంషాబాద్‌ చేరుకొని..11గంటలకు చార్మినార్ దగ్గర ఏర్పాటు చేసిన రాజీవ్‌ గాంధీ సద్భావన యాత్ర సభలో పాల్గొంటారు. ఈ సభలో మాజీ సీఎం కొణిజేటి రోశయ్యకు రాజీవ్‌ గాంధీ సద్భావన స్మారక అవార్డును అందజేయనున్నారు. మధ్యాహ్నం 12.45నిమిషాలకు ఆదిలాబాద్ జిల్లా బైంసాలో నిర్వహించే ఎన్నికల సభలో ప్రసంగిస్తారు.  సాయంత్రం 4.45నిమిషాలకు కామారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభకు హాజరై.. తర్వాత రాత్రి ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. ఈ క్రమంలోనే రేపు (అక్టోబర్-15) కామారెడ్డి, బైంసా ప్రాంతాల్లో AICC ప్రధాన కార్యదర్శి కుంతియా TPCC చీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డిలు వెళ్లి పరిశీలించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates