తెలంగాణలో 24 స్థానాలకు జనసేన పోటీ!

డిసెంబర్ 7న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో 24 స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌. దీనిపై నాలుగైదు రోజుల్లో స్పష్టత ఇవ్వనున్నట్టు చెప్పారు. అయితే ముందస్తు ఎన్నికలు రావాల్సిన అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఆదాయపన్ను శాఖ దాడులపై మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. విజయవాడలో జనసేన పార్టీ కార్యాలయాన్ని పవన్ కల్యాణ్ ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

 

Posted in Uncategorized

Latest Updates