తెలంగాణ అభివృద్ధిలో ముందుకెళ్తోంది : కేటీఆర్

KTRతెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం (జూన్-2) రాజన్న సిరిసిల్లలో మాట్లాడిన కేటీఆర్..నాలుగేళ్లలో రాష్ట్రం అనేక పథకాలతో ముందుకెళ్తుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన అన్ని పంటలకు మద్దతు ధర ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్.  రైతుల కోసం రైతుబంధు, రుణమాఫీ చేసిన ప్రభుత్వం..ఈ ఆగస్టు నుంచి రైతు భీమా పథకాన్ని ప్రవేశపెడుతున్నామన్నారు.

సిరిసిల్ల జిల్లాలోని 625 చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, కాళేశ్వరం ద్వారా వేములవాడ, రాజన్న ప్రాంతంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. వచ్చే యాసంగికి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు మంత్రి కేటీఆర్.  భూ రికార్డుల ప్రక్షాళనలో రాజన్న సిరిసిల్ల జిల్లా ముందుండటం గర్వకారణం అన్నారు. జూన్ 20లోగా వందశాతం పట్టాపాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపీణీ జరుగుతుందని, త్వరలోనే ధరణీ వెబ్ సైట్ అందుబాటులోకి వస్తుందన్నారు. మిషన్ భగీరథ 95 శాతం పనులు పూర్తయ్యాయని త్వరలోనే వేములవాడ, సిరిసిల్లలో ఇంటింటికి మంచి నీరు వస్తుందన్నారు. టీ హబ్, టాస్క్ వెబ్ సైట్లతో నిరుద్యోగులకు కావాల్సిన ఉద్యోగాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. హరితహారంలో భాగంగా త్వరలో విడుదల కానున్న 4వ విడత కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలన్నారు. ఆహార భద్రత కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసలుబాటు కల్పించిన ఏకైన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.

 

Posted in Uncategorized

Latest Updates