తెలంగాణ అలర్ట్ : రైళ్లు, విమానాశ్రయాల్లో నిఫా వైరస్ చెకింగ్స్

virusకేరళను వణికిస్తున్న నిఫా వైరస్ తో ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ అలర్ట్ అయ్యింది. వైరస్ రాష్ట్రంలోకి ప్రవేశించకుండా తెలంగాణ హెల్త్ డిపార్ట్ మెంట్ అలర్ట్ అయ్యింది. అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు వైద్యశాఖ అధికారులు. కేరళ రాష్ట్రం నుంచి వచ్చే రైళ్లు, విమానాల్లోని ప్రయాణికులకు పరీక్షలు చేయాలని నిర్ణయించారు. ఆ రాష్ట్రం నుంచి ఎవరు వచ్చినా.. విధిగా వైద్య పరీక్షల తర్వాతే బయటకు పంపించాలని నిర్ణయించారు. ఈ మేరకు రైళ్లు, విమానాశ్రయాల్లో వైద్య పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు.

శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. కేరళ – హైదరాబాద్ మధ్య విమాన ప్రయాణీకులను తనిఖీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి కేసు నమోదు కాలేదు. అయినా కూడా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రైల్వే, ఎయిర్ పోర్ట్ హెల్త్ ఆర్గనైజేషన్లను తెలంగాణ హెల్త్ డిపార్ట్ మెంట్ ఆదేశించింది. నిఫా వైరస్ వల్ల కేరళలో 10 మంది చనిపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరికొన్ని రోజులు ఇలాంటి వైద్య పరీక్షలు తప్పవని.. ప్రయాణికులు అందరూ సహకరించాలని కోరారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి అంశం కావటంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.

Posted in Uncategorized

Latest Updates