ఢిల్లీలో తెలంగాణ అవతరణ సంబురాలు

DELతెలంగాణ ఆవిర్భావ సంబురాల్లో భాగంగా.. శుక్రవారం (జూన్-1) ఢిల్లీలో 3కే రన్ నిర్వహించారు. బ్యాడ్మింటన్ కోచ్.. పుల్లెల గోపిచంద్ 3కే రన్ ప్రారంభించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ దగ్గర నుంచి ఇండియా గేట్ వరకు రన్ జరిగింది. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాల చారి, రామచంద్రు తేజావత్.. తెలంగాణ భవన్ సిబ్బంది ఉత్సాహంగా రన్ లో పాల్గొన్నారు.

శనివారం (జూన్-2)న జరిగే తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో బారీ ఏర్పాట్లు  చేశారు అధికారులు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆఫీసులల్లోనూ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. స్కూల్స్ లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందు ఏర్పాట్లు చేశారు.

Posted in Uncategorized

Latest Updates