తెలంగాణ ఆవిర్భావ వేడుకలు : మొదలైన ఏర్పాట్లు

TSప్రాచీన కళలు, విభిన్న సంప్రదాయాలకు కేరాఫ్ తెలంగాణ. జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించనుంది ప్రభుత్వం.  తెలంగాణా టూరిజం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజాలో మూడు రోజులు తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్  నిర్వహించనుంది.  ప్రైవేట్ హోటల్స్ , రెస్టారెంట్లు తెలంగాణ వంటకాలు అందరికి తెలిపేలా ఫుడ్ ఫెస్టివల్స్ ఏర్పాటు చేశాయి. వివిధ రాష్ట్రాల వారికి తెలంగాణ వంటలను రుచి చూపించేలా ప్రిపరేషన్ చేస్తున్నాయి.

ఎర్రమంజిలోని ఓ 5 స్టార్ హోటల్ టేస్ట్ ఆఫ్ తెలంగాణా  పేరుతో ఫుడ్ ఫెస్టివల్ ను ఏర్పాటు చేసింది. పచ్చి పులుసు నుంచి ఎన్నో తెలంగాణ వంటకాలు ఇక్కడ నోరూరిస్తున్నాయి. వెజ్ తో పాటు నాన్ వెజ్ వంటకాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మటన్ ఫలావ్, నాటు కోడి పులుసు, తలకాయ కూర, మటన్ లివర్ ఫ్రై, దోసకాయ పప్పు, జొన్న రొట్టెలు, సకినాలు, కొబ్బరిలైజు, పొంగలి, సర్వపిండి వంటి రుచులతో ఫుడ్ మెనూ లాంచ్ చేశారు. మరికొన్ని హోటల్స్ లో చికెన్ వెరైటీలు ఘుమఘుమలాడుతున్నాయి. ఓరుగల్లు వెజ్ పులావ్, పలవంచ కోడి పులావ్, రాచకొండ కోడి పులావ్, తెలంగాణ మాంసం కూర, గోల్కొండ కోడి ప్రై, అవిసెల కోడి వేపుడు, తాటి ముంజల మిల్క్ షేక్, గ్రీన్ మ్యాంగో ఫలుధా, ఖజూర్ లస్సీ వంటి వంటకాలను వంటకాలను సిద్ధం చేశారు నిర్వాహకులు.

తెలంగాణ రుచులకు మోడ్రన్ టచ్ ఇస్తూ నోరూరించే వెజ్ అండ్ నాన్ వెజ్ ఫుడ్ వెరైటీలతో రారామంటున్నాయి హోటల్స్. ఇక అందరికీ అందుబాటు ధరల్లో బఫేలను అందిస్తున్నాయి మరికొన్ని హోటల్స్. కొన్ని 300 రూపాయల నుంచి నుంచి స్టార్ట్ అయితే… మరికొన్ని హోటల్స్.. 599,  ప్లస్ ట్యాక్స్ గా ధరలు నిర్ణయించాయి. సిటి హోటల్స్ లో ఫారెన్ ఫుడ్స్  కాంపిటీషన్ ఎంత ఉన్నా తెలుగు వంటలకు ఉన్న క్రేజ్ వేరంటున్నారు. 50 రకాల వంటలతో 20 స్టాల్స్ అందుబాటులో ఉంచనుంది. రంజాన్ సీజన్ కావడంతో హోటల్స్, రెస్టారెంట్స్… కొత్త వంటకాలను మెనూలో ఉంచుతోంది.

Posted in Uncategorized

Latest Updates