తెలంగాణ ఇసుక పాలసీ బాగుంది: సిద్దూ

sidhuతెలంగాణ రాష్ట్రంలో ఇసుక పాలసీని పంజాబ్ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ప్రశంసించారు. పంజాబ్ రాష్ట్రంలో కూడ ఇదే తరహ పాలసీని అమలు చేస్తామని ఆయన ప్రకటించారు. రాష్ట్రంలోని కాళేశ్వరం ఇసుక రీచ్‌లను సిద్దూ పరిశీలించారు. ఇసుక అక్రమ రవాణకు సర్కార్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయన్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఈ రకమైన చర్యలతో అడ్డుకట్ట పడుతుందన్నారు. రెండు నదులున్న తెలంగాణ రాష్ట్రంలో ఇసుక రాబడి సుమారు రూ.1300 కోట్లుంటే, నాలుగు నదులున్న పంజాబ్ రాష్ట్రంలో ఇసుక రాబడి కేవలం రూ.130 కోట్లు మాత్రమేనన్నారు సిద్దూ.

అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇసుక పాలసీపై కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రమైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ సమయంలో సిద్దూ.. తెలంగాణ ఇసుక పాలసీని ప్రశంసించడం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలను ఇరుకున పెట్టినట్లయ్యిందంటున్నారు విశ్లేషకులు.

Posted in Uncategorized

Latest Updates