తెలంగాణ ఉద్యమ జ్యోతి: ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి

jayaShankarతెలంగాణ తొలి ఉద్య జ్యోమతి. పోరాట సూరీడు, ప్రత్యేక రాష్ర్టం కోసం అహరహం పరితపించి, జీవితాన్ని ధారపోసిన దార్శనికుడు, పోరాట యోధుడు, మూడు తరాల ఉద్యమ వారధి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ . ఇవాళ ఆయన వర్ధంతి.

ప్రొఫెసర్ జయశంకర్..తెలంగాణ ఉద్యమ జ్యోతి. సిద్దాంత కర్త, తొలితరానికి ఊపిరై.. మలితరానికి మార్గదర్శియై.. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటూ నినదించారు.. తెలంగాణ నినాదమే ఎజెండాగా ముందుకు సాగారు.. వివక్షను పశ్నించారు. దోపిడీపై కలం సంధించారు. ఖండాంతరాలల్లో ప్రత్యేక ఆకాంక్షను వినిపించారు. ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగారు. నేను సిద్ధాంతకర్తను కాను స్వచ్ఛంద కార్యకర్తనే అంటూ… తన బలం బలహీనత తెలంగాణే అన్నారు. ఆఖరికి స్వప్నం సాకారం కాకుండానే తుది శ్వాస విడిచారు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.

1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జయశంకర్ జన్మించారు. బెనారస్, ఆలీఘడ్ విశ్వవిద్యాలయాల్లో చదివిన ఆయన ఉస్మానియాలో పీహెచ్ డీ చేశారు. 1952లో నాన్ ముల్కి ఉద్యమంలో కీలక పాత్రా పోషించారు. 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టారు. మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించారు. 1960లో ఉపాధ్యాయ వ్రుత్తిలో అడుగు పెట్టి వరంగల్  సీకేఎం కాలేజీలో ప్రిన్సిపాల్ గా పనిచేశారు. 1979 నుంచి 1981 వరకు కేయూ రిజిస్ర్టార్ గా, 1991 నుంచి 1994వరకు కేయూ ఉప కులపతిగా సేవలందించారు. ప్రాంతీయ అసమానతలపై ఆధ్యయనం చేసిన జయశంకర్ 1969 తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.

నాటి చెన్నారెడ్డి నుంచి చిన్నారెడ్డి వరకూ.. నేటి కేసీఆర్..కోదండరాంలను కలుపుకొని పనిచేశారు.  జయశంకర్ సారు. కేసీఆర్ కు రాజకీయ గురువుగా…సిద్దాంత కర్తగా.. ఉద్యమంలో ఉప్పుగా..కనువిప్పుగా పనిచేస్తూ వచ్చారు. అవ్వాల్సిన చోట ఘనమై, ఇంకాల్సిన చోట ద్రవమై, వీచాల్సిన చోట వాయువై, రగలాల్సిన చోట నిప్పై ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నరనరాన తెలంగాణ ఉద్యమాన్ని నింపుకొని.. ఇంటికి పెద్దన్నలా చేయి చేయి కలిపి తెలంగాణ ఉద్యమ వంతెనను నిర్మించారు.

ప్రత్యేక తెలంగాణ వాదం కేవలం ఒక రాజకీయ నినాదం కాదని…. దానికి బలమైన ఆర్ధిక కారణాలున్నాయి. విశిష్టమైన సాంస్క్రుతిక కోణం దాగుంది. సుదీర్ఘమైన చారిత్రక నేపధ్యం ఉందని చెప్పేవారు…జయశంకర్. వీటన్నిటితో ఊపిరి పోసుకున్నది కనుకనే.. తెలంగాణ ఉద్యమం ఎన్ని ఒడుదుడుకులు వచ్చినా తొణకదని  పిలుపునిచ్చారు….ప్రొఫెసర్ జయశంకర్. వందల ప్రశ్నలకు తానొక్కడినే సమాదానం అంటూ ముందు వరుసలో నిలబడేవారు.

జయశంకర్ విద్యావేత్తగా ఎందరో విద్యార్ధుల విద్యాభివ్రుద్దికి పాటు పడ్డారు. తెలంగాణా ప్రజలకు ఉద్యమ పాఠాలు చెప్పారు. ఉద్యమం మరింత వ్రుధ్రుతంగా సాగేందుకు..పేరు పేరునా తెలంగాణా ఆవశ్యకత తెలియజెప్పారు.

తెలంగాణ ప్రజలకు ఎదరైన ప్రతి పరాభవానికీ ఆయన కలత చెందుతూ వచ్చారు. అడుగడుగునా తెలంగాణ బిడ్డలకు ఎదురవుతున్న అవమానాలను తన అవమానాలుగా భరించారు. జాతి బాధను తన బాధగా.. జాతి అభివ్రుద్దిలోనే తన అభివ్రుద్ది ఉందని తలిచారు. అదే శయశంకర్ ఉద్యమానికి ఓ ఉద్యోగస్తుడిలా మారి పనిచేసేలా చేసింది.

Posted in Uncategorized

Latest Updates