తెలంగాణ, ఏపీలో…మండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల

 తెలంగాణ, ఏపీలో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 2019 మార్చి-29తో ఏపీ, తెలంగాణలలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికైన ఆరుగురు MLCల పదవీకాలం ముగియనుంది. ఏపీలోఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి, తెలంగాణలో.. మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి, వరంగల్‌-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌-కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా అక్టోబర్‌- 1న ఓటర్ల జాబితాను విడుదల చేయనుంది. జనవరి నెలాఖరు వరకు ఆ జాబితాపై అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నట్టు తెలిపింది. ఫిబ్రవరి- 20న, 2019న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది

Posted in Uncategorized

Latest Updates