తెలంగాణ గురుకులాలు దేశంలోనే నెంబర్ వన్: కడియం

kadiyamతెలంగాణ గురుకులాలను దేశంలోనే నెంబర్ వన్ గురుకులాలుగా తీర్చిదిద్దాలన్నారు  డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. గురుకులాలను దేశానికి రోల్ మోడల్ గా మార్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలు JEE, నీట్ లలో తెలంగాణ గురుకులాల నుంచే ఎక్కువ మంది విద్యార్థులు సీట్లు సాధించేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే రాష్ట్ర గురుకులాలు దేశంలో మంచి పేరు సంపాదించాయని.. ఇదే విధానాన్ని కొనసాగించాలని అధికారులకు సూచించారు. SC,ST,BC, మైనారిటీ , విద్యాశాఖ గురుకుల సొసైటీల కార్యదర్శులు, విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, విద్యాశాఖ సంచాలకులు కిషన్ , ఇతర అధికారులతో మంత్రి కడియం గురువారం(ఏప్రిల్-12) సెక్రటేరియట్ లో గురుకుల విద్యాలయాల పటిష్టతపై సమీక్ష చేశారు.

SC,ST,BC, మైనారిటీ, విద్యాశాఖ గురుకులాలన్నింటిలోనూ ఒకే విధమైన మెనును ఇప్పటికే అమలు చేస్తున్నామని..దీన్ని మరింత పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. గురుకులాలన్నింటికీ ఒకే పరీక్షా విధానం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులందరికీ హెల్త్ అండ్ హైజీన్ కిట్స్ అందించాలన్నారు. బాలికలకు న్యాప్కిన్స్ సరిపడా ఇవ్వాలని అది కూడా.. పది నెలలకు కాకుండా 12 నెలలకు సప్లయ్ చేయాలన్నారు. చాలామంది బాలికలు రక్తహీనతతో బాధపడుతున్నారని, వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి గురుకులంలో ఒక ANM ఉండాలన్నారు. అదేవిధంగా క్రీడలు, ఆటలు ప్రోత్సహించేందుకు PET కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గురుకుల విద్యాలయంలో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయాలని, డిజిటల్ క్లాసులు నిర్వహించాలన్నారు.

ఐదు గురుకులాల్లో కల్పించే వసతులు కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూళ్లలో కూడా ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గురుకులాల ప్రవేశాల్లో కూడా నియోజక వర్గాల్లోని స్థానికులకు కొంత ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ప్రస్తావించారని.. దానిని దృష్టిలో పెట్టుకుని అందుకనుగుణంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కొత్త జిల్లాలను యూనిట్ గా తీసుకుని అడ్మిషన్లు నిర్వహిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందన్నారు డిప్యూటీ సీఎం కడియం.

Posted in Uncategorized

Latest Updates