తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో భారీ భద్రత

నాలుగు రాష్ట్రాల దండకారణ్యం ఛత్తీస్‌గఢ్ లో యుద్ధమేఘాలు ముసురుకున్నాయి …ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు ప్రజాప్రతినిధులే టార్గెట్‌గా ప్రతీకార చర్యలకు పాల్పడుతున్నారు. మారోవైపు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులను షల్టర్‌జోన్‌గా చేసుకుని ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం కేంద్రంగా మావోలు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోలీస్ అధికారులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ వారికి అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తుండటంతో ఇక్కడి పోలీస్ అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టులు టార్గెట్ చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు ముందస్తుగా జాగ్రత్తలను సూచిస్తున్నారు. ఎన్నికల జరగనుండటంతో తమకు సమాచారం లేకుండా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టవద్దని తెలంగాణ పోలీస్ అధికారులు ఇప్పటికే రాజకీయ నాయకులకు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates