తెలంగాణ, ఛత్తీస్ గఢ్ సరిహద్దుల్లో హై అలర్ట్

maoists12తెలంగాణ, ఛత్తీస్ గఢ్  దండకారణ్య సరిహద్దుల్లో టెన్షన్ నెలకొంది. సోమవారం (ఫిబ్రవరి-5) మావోలు బంద్ కు పిలుపునివ్వడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపూర్ మండలం ఎదిర గ్రామంలో BSNL టవర్ ను పేల్చేశారు మావోయిస్టులు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిస్టున్నట్టు మావోలు లేఖ విడుదల చేశారు.

మావోల చర్యలతో CRPF , పోలీసు బలగాలు అలర్ట్ అయ్యాయి. సరిహద్దులో గాలింపు ముమ్మరం చేశాయి. వెంకటాపురం, వాజేడు మండలాల్లో కూంబింగ్  జరుగుతోంది. అనుమానితులను తనిఖీ చేస్తున్నారు. టవర్ పేల్చివేత ఘటనతో ఎప్పుడేం  జరుగుతుందోనని స్థానికులు భయపడుతున్నారు.

Posted in Uncategorized

Latest Updates