తెలంగాణ టీ20 లీగ్ : ముగిసిన ఫస్ట్ రౌండ్ మ్యాచ్ లు

TTLFవెంకటస్వామి మెమోరియల్ తెలంగాణ టీ-20 లీగ్ మ్యాచ్ లో మూడో రోజు ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ పై నిజామాబాద్ టీం విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన హైదరాబాద్…20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 రన్స్ చేసింది. డ్యానీ ప్రిన్స్ 81, విట్టల్ అనురాగ్ 73 రన్స్ తో రాణించారు. 179 రన్స్ టార్గెట్ తో బరిలో దిగిన నిజామాబాద్ నైట్స్ 19 పాయింట్ 3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ ఫినిష్ చేసింది. ఓపెనర్ తనయ్ త్యాగరాజన్ 68 రన్స్, ప్రణీత్ రెడ్డి 32 రన్స్ తో రాణించారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ప్రణీత్ రెడ్డికి దక్కింది.

సెకండ్ మ్యాచ్ లో నల్లగొండ లయన్స్ పై ఖమ్మం టీరా ఘన విజయం సాధించింది.. 8 వికెట్ల తేడాతో ఖమ్మం గెలిచింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన నల్గొండ 19 పాయింట్ 5 ఓవర్లలో 156 రన్స్ చేసింది. ఆశీష్ రెడ్డి 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఖమ్మం బౌలర్లలో నరేందర్ రెడ్డికి 4 వికెట్ల దక్కాయి. లయన్స్ ఇచ్చిన 157 రన్స్ టార్గెట్ ను 18 ఓవర్లలోనే ఛేజ్ చేసి మ్యాచ్ గెలుచుకుంది ఖమ్మం. జునైద్ అలీ, అస్కరీ హాఫ్ సెంచరీలతో మ్యాచ్ గెలిపించారు. 2 వికెట్లు తీసి, 42 పరుగులు చేసిన ఖమ్మం ఆల్ రౌండర్ సాయి కుమార్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.

TTLలో మొదటి రౌండ్ ముగిసిందన్నారు లీగ్ డైరెక్టర్ ఆగమ్ రావు. తొమ్మిది నుంచి 11 వరకు రౌండ్ టూ జరగనుందన్నారు. రంజీ ప్లేయర్లకు ధీటుగా జిల్లా ఆటగాళ్లు బాగా ఆడుతున్నారని చెప్పారు. అన్ని మ్యాచులకు ప్లేయర్లతో పాటు… పబ్లిక్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందంటున్నారు లీగ్ నిర్వహకులు.

Posted in Uncategorized

Latest Updates