తెలంగాణ డిమాండ్ : అన్ని జల వివాదాలకు ఒకే ట్రిబ్యునల్

28276745_1849397328406343_605444249825366197_nజలవివాదాలకు జాతీయస్థాయిలో ఒకే ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించారు హరీశ్‌. మంగళవారం (ఫిబ్రవరి-20) హైదరాబాద్‌లో కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ నేతృత్వంలో జరుగుతున్న సదస్సుకు మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు.

ఒక్కో నది కోసం ఒక ట్రైబ్యునల్ పెట్టడం వల్ల కాలయాపన జరుగుతుందన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ 14 ఏళ్లుగా పనిచేస్తున్నా.. ఫైనల్ తీర్పు రాలేదన్నారు. RDS ఆధునీకరణ పనులకు ఏపీ అవరోధాలు సృష్టిస్తోందని, ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలన్నారు హరీశ్‌. ఏపీ, కర్నాటక, తెలంగాణల మధ్య RDSపై త్రైపాక్షిక ఒప్పందం అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులేవీ నిర్మించడం లేదని.. పాతవి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులనే పూర్తి చేస్తున్నామన్నారు. కాళేశ్వరం పాత ప్రాజెక్టు అని కేంద్రప్రభుత్వమే గుర్తించిందన్నారు. కాళేశ్వరం విషయంలో ఏపీ చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని తెలిపిన హరీశ్.. పోలవరం వల్ల తెలంగాణలో ముఖ్యమైన ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. కేంద్రం జోక్యం చేసుకుని ముంపును నివారించాలని కోరారు మంత్రి హరీశ్‌.

Posted in Uncategorized

Latest Updates