తెలంగాణ తల్లిని చదువుల తల్లిగా చేయడమే ప్రభుత్వం లక్ష్యం

KADIYAMతెలంగాణ తల్లిని చదువుల తల్లిగా చేయడం, తెలంగాణను ప్రపంచస్థాయి విద్యాకేంద్రంగా మార్చడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశలో పనిచేస్తున్నామని తెలిపారు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. దేశంలో ఎక్కడా లేనన్ని గురుకులాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాలకు కూడా నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొస్తున్నారని చెప్పారు. ఆదివారం (ఏప్రిల్-15) జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాలోని శాయంపేట మండలం గోవిందరావుపేట కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో కోటి 54 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన తరగతి గదులు, ఆఫీసు కార్యాలయానికి స్పీకర్ మధుసూదనాచారి, ఎంపీ పసునూరి దయాకర్ తో కలిసి క‌డియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కడియం..తెలంగాణ విద్యార్థులు ప్రపంచంలో ఎవరితోనైనా పోటీ పడేవిధంగా మన విద్యావిధానం ఉండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ పదే పదే చెబుతుంటారని, ఆయన మార్గదర్శకత్వంలో నేడు తెలంగాణ విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నామని చెప్పారు.

ఈసారి వచ్చిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో పేపర్లు ప్రభుత్వ కళాశాలలు టాప్ లేపాయని ప్రచురించిన అంశాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ కాలేజీలు 79 శాతం ఫలితాలు సాధిస్తే.. ప్రైవేట్ కాలేజీలు 69 శాతం ఫలితాలే సాధించాయని దీనిని తల్లిదండ్రులు గుర్తించాలన్నారు. కొంతమంది తల్లిదండ్రులు స్టేటస్ కోసం ప్రైవేట్ కాలేజీల్లో పిల్లలను చదివిస్తున్నారని, వాస్తవానికి అక్కడి కంటే ప్రభుత్వ కాలేజీల్లోనే ఇప్పుడు బాగుందని, వసతులు కూడా చాలా మెరుగ్గా ఉన్నాయన్నారు.

Posted in Uncategorized

Latest Updates