తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిన కేటీఆర్

Telangana-telliఖమ్మం బైపాస్ రోడ్డులోని ఎన్టీఆర్ కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్. ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేందర్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని వీడీవోస్ కాలనీలో టాస్క్ కార్యాలయాన్ని ప్రారంభించారు కేటీఆర్. టాస్క్ సేవలను నిరుద్యోగ యువత వినియోగించుకోవాలని సూచించారు. టాస్క్ సేవలను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని చెప్పారు. ఖమ్మం స్టేషన్ రోడ్డులో వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రఘునాథపాలెంలో 400 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, కేజీవీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు కేటీఆర్.

Posted in Uncategorized

Latest Updates