తెలంగాణ తేజం…అర్జున అవార్డు గ్రహీత సిక్కిరెడ్డిని అభినందించిన కవిత

తెలంగాణ తేజం, అర్జున అవార్డు గ్రహీత నేలకుర్తి సిక్కిరెడ్డి ఇవాళ(సెప్టెంబర్-27) నిజామాబాద్ ఎంపీ కవితను కలిశారు.  హైదరాబాద్ లోని కవిత నివాసానికి సిక్కిరెడ్డి..తన కుటుంభసభ్యులతో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా సిక్కిరెడ్డిని సన్మానించారు కవిత. బ్యాడ్మింటన్ కు గాను… రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా రెండు రోజుల క్రితం అర్జున అవార్డ్ గెల్చుకున్న సిక్కిరెడ్డిని ఈ సందర్భంగా కవిత అభినందించారు. సిక్కిరెడ్డికి బతుకమ్మ జ్ణాపికను అందించారు కవిత. సిక్కిరెడ్డి మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నట్లు కవిత ఈ సందర్భంగా తెలిపారు. అంతర్జాతీయ క్రీడావేదికల్లో బ్యాడ్మింటన్ డబుల్స్  క్రీడాకారిణిగా తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగురువేశారంటూ సిక్కిరెడ్డిని ప్రశంసించారు కవిత. తెలంగాణ ఫ్రైడ్ సిక్కిరెడ్డి అని కవిత అన్నారు.

Posted in Uncategorized

Latest Updates