తెలంగాణ దినోత్సవం : పరేడ్ గ్రౌండ్ లో ప్రారంభమైన వేడుకలు

PAREDతెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు శనివారం (జూన్-2) రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వేడుకల్లో పాల్గొన్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రికి  పోలీసు బలగాలు గౌరవ వందనం సమర్పించారు. ఆ తర్వాత పోలీసులు మార్చ్ ఫస్ట్ చేశారు.  జాతీయ జెండాను ఆవిష్కరించారు కేసీఆర్. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.  అంతకుముందు  అసెంబ్లీ ముందున్న గన్ పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు సీఎం కేసీఆర్. సీఎంతో పాటు కేకే ఉన్నారు. మరికాసేపట్లో తెలంగాణ ప్రజలను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగించనున్నారు.

Posted in Uncategorized

Latest Updates