తెలంగాణ దేశానికే ఆదర్శం : కేంద్ర మంత్రి థావర్ చంద్

THAWAR-CHAND-GAHLOT11సామాజిక న్యాయం..సాధికారత విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్.  తెలంగాణలో ఇప్పటికే 45కోట్ల రూపాయల ఖర్చుతో దివ్యాంగులకు కావాల్సిన పరికరాలను సమకూర్చామన్నారు. కులాంతర వివాహలు చేసుకుని.. పారితోషకాలను తీసుకున్న వారు కూడా  రాష్ట్రంలోనే ఎక్కువగా ఉన్నారని చెప్పారు.

మంగళవారం (జూన్-4) మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని వృద్దులు దివ్యాంగులకు  అవసరమైన ఉపకరణాలను పంపిణేచేసే కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పథకాలపై కొనియాడారు కేంద్రమంత్రి.

Posted in Uncategorized

Latest Updates