తెలంగాణ, నాస్కమ్ మధ్యన కుదిరిన అగ్రిమెంట్

ktr-nasscom2 (1)రాష్ట్రానికి, నాస్కమ్ మధ్యన కుదిరిన అగ్రిమెంట్ తెలంగాణకే కాదు.. దేశానికి ఎంతో దోహదపడుతుందన్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం (ఫిబ్రవరి-20)  ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది.

మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఒప్పందం జరిగింది. డాటా సైన్స్, కృత్రిమ మేధాశక్తి అంశాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ ఒప్పందంతో తెలంగాణ ఖ్యాతి పెరుగుతుందన్నారు. రైతుల దగ్గరకే టెక్నాలజీని తీసుకెళ్తామన్నారు. టెక్నాలజీతో మైక్రోసాఫ్ట్ సాయంతో కంటి పరీక్షలు చేయిస్తున్నామన్నారు కేటీఆర్. ఈ ఒప్పందంతో 2025 సంవత్సరం కల్లా లక్ష 50వేల ఉద్యోగాలు వస్తాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేసిందన్న కేటీఆర్..ఎరువుల కోసం ఎకరాకు 8 వేలు మే నెల నుంచి ప్రారంభమవుతుందన్నారు.

Posted in Uncategorized

Latest Updates