తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు

TIHCగతంలో మూతపడ్డ తెలంగాణ పారిశ్రామిక ఆరోగ్య కేంద్రం(టీఐహెచ్‌సీ)ను తిరిగి ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. బేగంపేటలోని పర్యాటక భవన్‌లో టీఐహెచ్‌సీని ఇవాళ  ఉదయం 10 గంటలకు ప్రారంభించారు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్. ఈ కార్యక్రమానికి టీసీఐఐసీ ఎండీ నరసింహారెడ్డి, హెల్త్ క్లినిక్ సలహాదారు ఎర్రంరాజు హాజరయ్యారు.

ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ద్వారా ఆర్థికంగా చితికిపోయిన పరిశ్రమలకు అన్ని విధాలుగా తోడ్పడనున్నది. నాన్ బ్యాం కింగ్ ఫైనాన్స్ కంపెనీతోపాటు… ఇతర బ్యాంకుల ద్వారా ఆ పరిశ్రమలకు రుణసౌకర్యాలను అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో సరైన సహకారం లేక ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయి. ఈ పరిశ్రమలను పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూనుకొన్నది. నాన్‌బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బీఎఫ్‌సీ) ఏర్పాటుకు గత కొన్ని నెలల క్రితమే ఆర్బీఐ అనుమతించింది. కానీ సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)కి, ఇతర ఆర్థిక సంస్థలకు మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి లెక్కలను సమర్పించాల్సి ఉండటంతో కొన్ని రోజులపాటు వాయిదా వేశారు.

Posted in Uncategorized

Latest Updates