తెలంగాణ పోలీస్ ఈవెంట్స్ వాయిదా

ఈనెల 17 నుంచి జరగనున్న పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ మెజర్మెంట్స్, ఫిజికల్ ఈవెంట్స్ వాయిదా వేసినట్టు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ వెల్లడించింది. హైకోర్టు ఆదేశాల మేరకు PMT/PET పరీక్షలను వాయిదా వేసింది. మళ్లీ ఎప్పుడు నిర్వహించే తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. ఫిట్నెస్ టెస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 15 (శనివారం) అర్థరాత్రి వరకూ తమ హాల్ టిక్కెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో డే వైజ్ గా జరిగే టెస్టుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని TSLPRB ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. తేదీలు మాత్రం మారతాయన్నారు. ప్రింటవుట్ తీసుకున్న హాల్ టిక్కెట్స్ ను కొత్త డేట్స్ ప్రకటించిన తర్వాత ఉపయోగించుకోవచ్చని తెలిపారు. పోలీస్ ఈవెంట్స్ కొత్త తేదీలను త్వరలోనే ప్రకటించనున్నారు.

Posted in Uncategorized