తెలంగాణ పోలీస్ కు జాతీయ అవార్డు

telangana polishవిధి నిర్వహణలో చిత్తశుద్ధి కనబర్చిన తెలంగాణ పోలీసులకు కేంద్ర ప్రభుత్వ అవార్డు లభించింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ అత్యంత వేగంగా పూర్తి చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది. కేవలం నాలుగు రోజుల్లో తెలంగాణలో పోలీస్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయడంతో ఈ గౌరవం లభించింది. తర్వాతి స్థానాల్లో ఆంధ్రప్రదేశ్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌ ఉన్నాయి. వేగవంతంగా పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ పూర్తిచేస్తున్నందుకుగాను విదేశీ వ్యవహారాల మం త్రిత్వ శాఖ తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ను అభినందించింది. బెస్ట్‌ పోలీస్‌ వెరిఫికేషన్‌ అవార్డును తెలంగాణ వరుసగా మూడోసారి దక్కించుకోవడం విశేషం.  ‘వెరీ ఫాస్ట్‌’ టెక్నాలజీ యాప్‌ను ఉపయోగించడంతో ఈ లక్ష్యానికి చేరుకున్నారు తెలంగాణ పోలీసులు. గత ఏప్రిల్‌ 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 4 లక్షల 20 వేల 597 పాస్‌ పోర్టుల్ని కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెరిఫై చేశారు తెలంగాణ పోలీసులు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గుడ్‌ ప్రాక్టీసెస్‌లో భాగంగా అధికారులు నూతన విధానాల్ని అవలంభిస్తున్నారు. జూన్‌ 24న నిర్వహించే పాస్‌ పోర్టు సేవా దివాస్‌ సందర్భంగా కేం ద్ర ప్రభుత్వం తెలంగాణ పోలీ్‌సకు అవార్డు ప్రధానం చేయనుంది. అవార్డు స్వీకరించేందుకు రావాల్సిందిగా డీజీపీ ఎం. మహేందర్‌ రెడ్డికి కేంద్రం ఇప్పటికే ఆహ్వానం పంపింది. పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి ఎప్పటికప్పుడు ఫీడ్‌ బ్యాక్‌ అందివ్వడంతోపాటు థర్డ్‌ పార్టీ వెరిఫికేషన్‌ను చేపడుతున్నట్లు తెలిపారు డీజీపీ మహేందర్‌రెడ్డి. యూనిట్‌ అధికారులు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఫీల్డ్‌ సిబ్బంది చేస్తున్న కృషిని ఈ సందర్భంగా అభినందించారు మహేందర్ రెడ్డి.

Posted in Uncategorized

Latest Updates