తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే మంచి పేరు

తెలంగాణ పోలీస్ శాఖకు దేశంలోనే మంచి పేరు ఉందన్నారు హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ . పోలీస్ శాఖ లో 50 సర్వీసులు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ లో ఒకే సిస్టం ఉంటుందని.. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నలుగురికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామన్నారు. జీరో ఎఫ్ఐఆర్ పద్దతి ద్వారా వెంటనే స్పదిస్తున్నామన్నారు. 10 వేల పిటీషన్ లకు పైగా డోర్ టూ డోర్ పిటీషన్ లను నమోదు చేశామన్నారు. గత 7 సంవత్సరాలుగా శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీస్ శాఖ పనిచేసిందన్నారు. దీని వలన చాలా కంపెనీలు హైదరాబాద్ కు వచ్చాయన్నారు. కమాండ్ కంట్రోల్ కార్యాలయం కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు.

Latest Updates