తెలంగాణ పోలీస్…స్వాతి లక్రాకు రాజస్ధాన్ ప్రభుత్వం అవార్డ్

తెలంగాణ CID విభాగంలో మహిళల భద్రత, శాంతిభద్రతల ఐజీగా విధులు నిర్వర్తిస్తున్నస్వాతి లక్రాకు రాజస్ధాన్ గవర్నమెంట్ నుంచి …ప్రతిష్ఠాత్మక ప్రీసియస్‌ డాటర్స్‌ ఆఫ్‌ ఇండియా అవార్డ్ అందుకొన్నారు. బాలికల సంరక్షణ కోసం పాటుపడుతున్న వారికి ఈ అవార్డ్ అందిస్తారు.

శుక్రవారం(సెప్టెంబర్-28) జైపూర్ లో జరిగిన రాజస్ధాన్ నాల్గవ వార్షిక ఆరోగ్య సదస్సులో నేషనల్ హెల్త్‌ మిషన్‌, రాజస్థాన్‌ హెల్త్ డిపార్ట్ మెంట్ లు సంయుక్తంగా ఈ అవార్డును స్వాతి లక్రాకు అందజేశాయి. రాజస్ధాన్ హెల్త్ మినిస్టర్ కాలీ చరణ్‌ సరాఫ్‌ చేతుల మీదగా స్వాతి లక్రా ఈ పురస్కారం అందుకొన్నారు.

రాష్ట్రంలో..మహిళల భద్రత కోసం ఏర్పాటుచేసిన  షీ టీమ్స్, భరోసా సెంటర్ల ఇంచార్జ్ గా కూడా స్వాతి లక్రా ఉన్నారు.

Posted in Uncategorized

Latest Updates