తెలంగాణ ప్రజల “వెలుగు” వచ్చేసింది

సరికొత్త హంగులతో.. తెలంగాణ ఫ్లేవర్ తో కొత్త “వెలుగు” వచ్చేసింది. ఇవాళ (అక్టోబర్ 5)… ఇళ్ల లోగిళ్లముందు వాలిపోయింది. కొత్త “వెలుగు”.. విలువలకు అద్దం. తెలంగాణ బతుకు, బాధ, కష్టం, సుఖం, ఆలోచన, సంతోషం, విజయాల సంగతులే “వెలుగు” పత్రికకు ప్రాణం. తెలంగాణలో జీవితం ఓ పండుగ. వాటన్నింటినీ చూపే పత్రికే “వెలుగు”. మనోళ్లను.. మనూళ్లను మనకు తెలియని మన జీవితాల కోణాన్ని చూపించేదే పదహారు పేజీల “లైఫ్”. ఒక్కపూట చదివి పక్కనపెట్టేది కాదిది. మనకు అక్కరకొచ్చే కథనాలే ఇందులో ఉంటాయి.

కొత్త “వెలుగు”తో పత్రికా రంగంలోని భాషకు కొత్త వెలుగు వచ్చింది. మన మాట.. మన పలుకు… మన పత్రికలోకి వచ్చేశాయి. అర్థంకాని పదాలు… అర్థంచేసుకోవాల్సిన వాక్యాలు మన పత్రికలో ఉండవు. ఇది ముమ్మాటికీ మన పత్రిక. మన అందరి బతుకు ముచ్చట్లనే నింపుకుని వచ్చిన పత్రిక.

జిల్లాల కోసం స్పెషల్ టాబ్లాయిడ్ మన “వెలుగు”లో ఉండదు. నాలుగు పేజీల తెలంగాణంలో 31 జిల్లాల సమాచారం కనిపిస్తుంది. 31 జిల్లాల వార్తలు అందరూ తెల్సుకోవాలని ఉద్దేశించి పెట్టిందే “తెలంగాణం”. ప్రపంచంలోని అన్ని విషయాలను ‘ఓపెన్ గా చర్చించే పేజీ’ వెలుగులో ఉంది. ఇంకా నేషనల్, ఇంటర్నేషనల్, టాకీస్, బిజినెస్, ప్లే.. పేజీల్లో తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన వార్తలు మాత్రమే ఉంటాయి.

తెలంగాణ కోసం వీ6 నిలబడితే.. అదే తెలంగాణ వీ6ను గుండెల్లో పెట్టుకుంది. అలా… తెలంగాణ కోసం.. తెలంగాణ ప్రజల కోసం ప్రభాత “వెలుగు” నిలబడుతుంది. ఎన్నో పత్రికల్లో ఒకటిగా కాకుండా.. కంటెట్, డిజైన్, ప్రజెంటేషన్ లో మిగతావాటికి భిన్నంగా కనిపిస్తూ… తెలంగాణ కోసమే ప్రత్యేకమైన న్యూస్ పేపర్ మీ ముందుకొచ్చింది.

Posted in Uncategorized

Latest Updates