తెలంగాణ భవన్‌లో కేటీఆర్ బర్త్‌డే

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం(ఇవాళ) ఘనంగా జరుపుకొన్నారు. కేటీఆర్ జన్మదిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్‌తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ భవన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మంత్రులు మొక్కలు నాటారు. అనంతరం తెలంగాణ భవన్‌లో రక్తదాన శిబిరం నిర్వహించారు.

Posted in Uncategorized

Latest Updates