తెలంగాణ వాటా మరింత పెరగాలి : హరీశ్

harishఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్లో రెండో రోజు తెలుగు రాష్ట్రాలు వాదనలు వినిపించాయి. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనలను ప్రత్యక్షంగా విన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అవసరాలపై ఎంత కొట్లాడినా సరైన వాటా దక్కలేదన్నారు హరీశ్. రాష్ట్ర వాటాను ఎక్కడైనా వినియోగించుకోవచ్చని…. అప్పటి ప్రభుత్వం వాదించిందన్నారు. ప్రస్తుతం తెలంగాణకు 299, ఏపీకి 511 TMC ల వాటా ఉందన్నారు. ఇందులో తెలంగాణ వాటా మరింత పెరగాలన్నారు.

కోర్టులు, ట్రిబ్యునల్ లపై తమకు పూర్తి విశ్వాసం ఉందన్నారు. న్యాయంగా, నిబంధనల ప్రకారం రావాల్సిన వాటాపై కొట్లాడుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ నీటి పంపకాలను అనుసరించే తమ వాదనలు ఉన్నాయన్నారు. నీటి వాటాల కేటాయింపుపై కేంద్రం ఇప్పటి వరకు స్పందించక పోవడం బాధాకరమన్నారు.

అంతర్జాతీయ నీటి చట్టాలను అనుసరించి కోర్టులను ఆశ్రయిస్తే ఏడాది లోపు కేంద్రం వైఖరిని చెప్పాలన్నారు హరీశ్. కానీ మూడేళ్లు గడుస్తున్నా కేంద్రం తన అభిప్రాయం చెప్పలేదన్నారు. రెండో రోజు ట్రిబ్యునల్లో రెండు రాష్ట్రాల వాదనలు ముగియడంతో మార్చి 26,27,28 న మరోసారి వాదనలు విననుంది ట్రిబ్యునల్.

Posted in Uncategorized

Latest Updates