తెలంగాణ… వీరుల గడ్డ: స్మృతి ఇరానీ

తెలంగాణ వీరుల గడ్డ అన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. మెదక్ జిల్లా చేగుంటలో బీజేపీ మహిళా శంఖారావం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, బీజేపీ నేతలు హాజరయ్యారు. ఆరు నెలల ప్రసూతి సెలవులను కేంద్రం పెంచిందన్నారు. 5కోట్ల పేద మహిళలకు ఉజ్వల పథకం కింద  ఫ్రీ సిలిండర్ ఇచ్చామన్నారు.

ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద 1,300 రోగాలకు రూ.5లక్షల వరకు ఫ్రీగా చికిత్స అందిస్తున్నామన్న స్మృతి…80లక్షల మంది బీడీ కార్మికులకు గుర్తింపు కార్డులిచ్చామన్నారు. ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో తెలంగాణ పాల్గొనడం లేదన్నారు. హెల్మెట్ పెట్టుకొని వైద్యం చేయాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.

Posted in Uncategorized

Latest Updates