తెలంగాణ సివిల్ సప్లైలో టెక్నాలజికి నేషనల్ అవార్డు

CIVIL AWARDతెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానానికి జాతీయ స్థాయిలో ఈ ఏడాది కూడా మరో అవార్డు లభించింది. ఈ-పీడీఎస్‌ విధానం విజయవంతమైనందుకు తెలంగాణ పౌరసరఫరాల శాఖకు జెమ్స్‌ ఆఫ్‌ డిజిటల్‌ ఇండియా అవార్డు- 2018 లభించింది. ఢిల్లీలో బుధవారం (జూన్-13) జరిగిన కార్యక్రమంలో కోయెస్‌ ఏజ్‌ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్‌ కపిల్‌దేవ్‌ సింగ్‌ చేతుల మీదుగా తెలంగాణ పౌరసరఫరాల శాఖ జనరల్‌ మేనేజర్‌ జి.రాజేందర్‌ అవార్డును అందుకున్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేయటంతో శాఖలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందన్నారు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డాక్టర్‌ అకున్‌ సబర్వాల్‌. ప్రతిష్ఠాత్మక జెమ్స్‌ అవార్డు లభించటంతో అన్ని స్థాయుల సిబ్బందిలో మరింత స్ఫూర్తినిచ్చిందన్నారు సబర్వాల్.

Posted in Uncategorized

Latest Updates