తెలియకుండానే బండ బాదుడు : పెట్రోల్ పై పైసలు తగ్గి.. సిలిండర్ పై రూపాయిలు పెరిగింది

gas-cylinderఓ వైపు పెట్రోల్, డీజిల్ ధరలు పైసల్లో తగ్గుతుంటే మరోవైపు ఎల్ పీజీ గ్యాస్ ధరలు రూపాయిల్లో పెరుగుతున్నాయి. పెరిగిన ఎల్ పీజీ ధరలు సామాన్యుడికి పెద్ద గుదిబండగా మారాయి. రెండు రోజులుగా ఒక పైసా, ఐదు పైసలు అంటూ పెట్రోల్ ధరలను తగ్గిస్తూ వస్తున్న ఆయిల్ కంపెనీలు.. సిలిండర్ ధరను మాత్రం రూపాయిల్లో పెంచాయి. మన ఇంటికి వచ్చే సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.2.34 పెంచారు. అదే విధంగా సబ్సిడీ లేని కమర్షియల్ సిలిండర్ ధర ఏకంగా రూ.48 పెరిగింది. ఒక్కసారిగా సిలిండర్ ధరలు పెంచటంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలియకుండానే తమనెత్తిన బండ బాదుడు పడిందంటూ సామాన్యులు వాపోతున్నారు.

పెరిగిన ధరల ప్రకారం… దేశ రాజధాని ఢిల్లీలో సబ్సిడీ సిలిండర్ ధర రూ.493.55 ఉండగా, కోల్ కతాలో అత్యధికంగా రూ.496.65కి చేరుకుంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో రూ.491.31, చెన్నైలో రూ.481.84 గా సిలిండర్ ధరలు ఉన్నాయి. ఇక కమర్షియల్ LPG సిలిండర్ ధరలయితే భారీగా పెరిగాయి. మూడు వారాలుగా రోజు రోజుకి ఆయిల్ ధరలు పెరుగుతూ ఉండగా, బుధవారం ఒక పైసా, గురువారం 5 పైసలు పెట్రోల్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు సిలిండర్ ధరలు పెంచి.. బ్యాలెన్స్ చేసినట్లు అయ్యింది.

Posted in Uncategorized

Latest Updates