తెలివిగా దొంగను పట్టించిన హీరోయిన్

Parul-Yadav-1తన విలువైన వస్తువులను దొంగిలించిన దొంగను తెలివిగా పట్టించింది ఓ శాండల్ వుడ్ హీరోయిన్. ఇటీవల క్యాబ్‌ లో ప్రయాణించిన ఆమె నుంచి విలువైన వాచీలను ఆ క్యాబ్‌ డ్రైవర్‌ దొంగతనం చేశాడు. దీంతో ఆ హీరోయిన్ క్యాబ్ కాల్ సెంటర్ కి ఫిర్యాదు చేసినా ఫలితం దక్కలేదు.  పరుల్‌ యాదవ్‌ ఓ వివాహ వార్షికోత్సవ కార్యక్రమానికి హాజరుకావాల్సింది ఉంది. అందుకోసం ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్న ఆమె, దంపతుల కోసం విలువైన వాచీల సెట్లను వెంట తీసుకెళ్లారు. మార్గం మధ్యలో ఏదో పని మీద కిందికి దిగిన ఆమె, తిరిగి క్యాబ్‌ ఎక్కేసరికి ఓ వాచీ సెట్‌ కనిపించకుండా పోవటం గమనించారు. దిగాక డ్రైవర్‌ను ఈ విషయంపై ఆరా తీయగా, తనకు తెలీదంటూ అతను అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయాడు.  ఈ విషయంపై ఆమె ఓలా సపోర్ట్‌ సెంటర్‌ కు కాల్‌ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పోలీసులకు పరుల్‌ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు తిరిగి ఆమె వస్తువులను ఆమెకు అందజేశారు. పోలీసులకు కృతజ్ఞతలు చెబుతూ ఆమె ట్విటర్‌ లో పోస్టులు చేసింది. వ్యక్తుల గురించి ఎలాంటి నిర్ధారణ లేకుండా డ్రైవర్‌ లుగా ఎలా నియమించుకుంటారంటూ క్యాబ్‌ సర్వీస్‌ పై ఆమె మండిపడ్డారు. ప్రస్తుతం ఆమె క్వీన్‌ కన్నడ రీమేక్‌ బట్టర్‌ ఫ్లైలో నటిస్తోంది. చాలా తెలివిగా దొంగను పట్టించిందని హీరోయిన్ పై కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

Posted in Uncategorized

Latest Updates