తెలుగులోనూ ఎగ్జామ్ : రైల్వే ఉద్యోగాలకు వయసు పెంపు

railwayరైల్వే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే రిక్రూట్ మెంట్ బోర్టు(RRB). వయోపరిమితిని పెంచింది. ఇప్పటి వరకు నిర్ణయించిన వయసు అర్హతల్లో గరిష్ట పరిమితిని రెండేళ్లు పొడిగించింది. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ట వయోపరిమితిని మొదట రైల్వే బోర్డు జనరల్‌ అభ్యర్థులకు 28 ఏళ్లుగా నిర్ణయించింది. SC,ST లకు ఐదేళ్లు, OBCలకు మూడేళ్లు ఏజ్ సడలింపు ఇచ్చింది. ప్రస్తుతం ఏజ్ లిమిట్ ను  పెంచడంతో.. దరఖాస్తు గడువును కూడా త్వరలోనే పెంచనున్నట్లు RRB తెలిపింది. తెలుగు సహా ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించిన సవరణ ప్రకటనను వెబ్ సైట్ ను త్వరలో జారీ చేయనున్నట్లు తెలిపింది RRB. రైల్వే శాఖ ఇటీవల 90 వేల ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్‌ ఇచ్చింది.

Posted in Uncategorized

Latest Updates