తెలుగులో షా ట్వీట్ : ఆయుష్మాన్ భారత్ తెలంగాణకు అందటం లేదు

కేంద్రం ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ కార్యక్రం ప్రపంచంలోనే చాలా గొప్పదన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. అలాంటి కార్యక్రమం ద్వారా తెలంగాణ ప్రజలు లబ్దిపొందలేకపోతున్నారని, దీనికి టీఆర్ఎస్ పార్టీనే కారణమన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24) అమిత్ షా ట్విట్టర్ వేదికగా తెలుగులో ట్వీట్ చేస్తూ… ప్ర‌ధాన‌మంత్రి మోదీ గారిచే ప్రారంభించ‌బ‌డిన‌ “జ‌న ఆరోగ్య యోజ‌న- ఆయుష్మాన్ భార‌త్” కార్య‌క్ర‌మం ప్ర‌పంచంలోనే చాలా గొప్ప‌ది. అలాంటి కార్య‌క్ర‌మాన్ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అంద‌కుండా తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించ‌డం బాధాక‌రం. టీఆర్ఎస్ ప్ర‌భుత్వ స్వార్ధ ఆలోచ‌న కార‌ణంగా తెలంగాణ పేదలు ఈ అద్భుత‌మైన కార్య‌క్ర‌మ ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌లేక‌పోతున్నారు. దీనిపై ప్ర‌భుత్వం తెలంగాణ ప్ర‌జ‌ల‌కు స‌మాధానం చెప్పాలి. పేద‌ల వ్య‌తిరేక నిర్ణ‌యాన్ని తీసుకున్న టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని బీజేపీ కార్య‌క‌ర్త‌లు నిల‌దీయాలి. ఇంటింటికి వెళ్లి ప్రజలను జాగృతి చేయాలని బీజేపీ కార్యకర్తలకు తెలిపారు.

Posted in Uncategorized

Latest Updates