తెలుగు అక్షరం కిరికిరి : ఐఫోన్ లో ‘జ్ఞ’ కొడితే అన్నీ క్లోజ్

appleఇప్పటి వరకూ ప్రపంచలోనే దాన్ని తలదన్నే ఫోన్ రాలేదు. ప్రపంచంలోనే టాప్‌ బ్రాండ్‌. చేతిలో ఐఫోన్ ఉంటే అది ఓ స్టేటస్ సింబల్. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే బ్రాండ్‌ ఇదే. ఇలాంటి ఐఫోన్ కు ఓ తెలుగు అక్షరం ఇబ్బంది పెడుతోంది. “జ్ఞ” అనే తెలుగు అక్షరం టైప్‌ చేస్తే ఫోన్‌లోని యాప్స్‌ అన్నీ వాటంతట అవే క్రాష్‌ అవుతున్నాయి. ఛాటింగ్‌ యాప్స్‌, టెలిగ్రామ్‌, స్కైప్‌ ఓపెన్‌ చేసి మెస్సేజ్‌ కంపోజ్‌ చేయడానికి ప్రయత్నించిన వారికి ఈ సమస్య ఎదురవుతుంది. దీనిపై స్పందించిన ఆపిల్‌ కంపెనీ తన iosలో ఈ బగ్‌ ఉందంటూ నిర్ధారించింది.

ఈ సమస్యను సరిచేయడానికి త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రస్తుతం బీటా వెర్షన్‌ వాడుతున్నవారికి ఎలాంటి ఇబ్బంది లేదని కంపెనీ తెలిపింది. ఈ బగ్‌తో యాపిల్‌ సంస్థపై సోషల్ మీడియాలో తెగ సటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఇంత చిన్న బగ్‌ను పరిష్కరించలేని ఆపిల్‌కు.. అంత పెద్ద పేరు ఎలా వచ్చిందంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏమైనా ఓ తెలుగు అక్షరం ఇంత పెద్ద సంస్థకు సవాల్ కావటం విశేషం కదా..

Posted in Uncategorized

Latest Updates