తెలుగు దర్పానికి ఎన్టీఆర్ ప్రతిరూపం : వెంకయ్యనాయుడు

NTR-Biopic-Venkaiah-naiduతెలుగుదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నందమూరి తారక రామారావుకే చెందుతుంది అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఆయన జీవితంపై సినిమా రావటం అనేది గొప్ప విషయం అన్నారు. అందులోనూ ఆయన కుమారుడు, నట వారసుడు బాలకృష్ణ నటిస్తూ తెరకెక్కటం అనేది ఎంతో శుభపరిణామంగా అభివర్ణించారు వెంకయ్య. ఎన్టీఆర్ పై ఉన్న ప్రేమ, ఆయన కుటుంబంతో ఉన్న అనుబంధం కారణంగా ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి రావటం జరిగిందన్నారు. రాబోయే తరాలకు కూడా ఇలాంటి మహోన్నత వ్యక్తి గురించి తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సినిమా విజయం సాధించటం కంటే.. ప్రజలకు చేరువ కావటమే ముఖ్యం అన్నారు. ప్రతి ఒక్కరూ ఎన్టీఆర్ జీవిత చరిత్రను తెలుసుకోవాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్లో నటించిన విలన్లు కూడా అభిమానించే వారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ చరిత్రను రాయటం, సినిమా తీయటం ఎంతో అవసరం అన్నారు. తండ్రి పాత్రనే కుమారుడు పోషించటం అనేది దేశచరిత్రలో ఇదే అన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.

Posted in Uncategorized

Latest Updates