తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిది : వెంకయ్య

VENKAIAHరాజకీయాల్లో శత్రువులు ఉండరని ప్రత్యర్థులే ఉంటారని చెప్పారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కళలు, సంగీతం, సంప్రదాయాలను తెలుగు రాష్ట్రాల సీఎంలు కాపాడుతున్నారని చెప్పారు. హైదరాబాద్ లో రాగసప్త స్వరం సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రదానం చేశారు వెంకయ్యనాయుడు. రోశయ్యకు స్వర్ణ కంకణం బహుకరించిన వెంకయ్య,, రోశయ్య బహుముఖ ప్రజ్ఞాశాలి, కార్యదక్షుడని కొనియాడారు. సౌమ్యత, విషయ స్పష్టతతో ఏ పనినైనా నిబద్ధతతో చేసేవారని తెలిపారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పదవులు కోరుకుంటే వచ్చినవి కాదని రోశయ్య చెప్పారు.

Posted in Uncategorized

Latest Updates