తెలుగు రాష్ట్రాల హైకోర్ట్ లకు ప్రధాన న్యాయమూర్తుల నియామకం

ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ప్రవీణ్ కుమార్ ను కేంద్రం నియమించింది. జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఏపీ సీజేగా జనవరి 1న బాధ్యతలు తీసుకోనున్నారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టి.బి రాధాకృష్ణన్ ఇకపై తెలంగాణ చీఫ్ జస్టిస్ గా కొనసాగనున్నారు. దీనికి సంబంధించి కేంద్రం ఇవాళ(గురువారం) ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు జస్టిస్ ఆర్ఎస్ చౌహన్ , జస్టిస్ రామ సుబ్రమణియన్ ను తెలంగాణకి కేటాయించింది. ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ నిన్న కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది.

ఆ ఉత్తర్వుల్లో హైకోర్టు విభజన, న్యాయమూర్తుల కేటాయింపు చేసిన కేంద్రం.. ప్రధాన న్యాయమూర్తులను ఇవాళ ప్రకటించింది. మరోవైపు ఉమ్మడి హైకోర్టులో మొత్తం 27 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా వీరిలో 14 మందిని ఏపీకి, 10 మందిని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించింది. ఏపీకి కేటాయించిన వారిలో సీనియర్ గా ఉన్న జస్టిస్  ప్రవీణ్ కుమార్ ను ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. తాజా నిర్ణయంతో ఏపీలో 14 మంది, తెలంగాణలో 13 మంది న్యాయమూర్తులు పనిచేయనున్నారు.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Posted in Uncategorized

Latest Updates