తెలుసుకోండి : పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పులు ఇవే

143-3-696x392తెలంగాణ పంచాయతీరాజ్, పురపాలక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. పంచాయతీ రాజ్, పురపాలక బిల్లుపై గురువారం (మార్చి-29) అసెంబ్లీలో చర్చ జరిగిన అనంతరం బిల్లుకు ఆమోదం తెలిపారు స్పీకర్. అయితే కొత్త పంచాయతీరాజ్ చట్టంలో ఏం మార్పు చేశారో చూద్దాం..

 

పంచాయతీరాజ్ చట్టంలో చేసిన మార్పులు

– కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం రాష్ట్రంలో 12 వేల 751 పంచాయతీలు ఉంటాయి. ఇందులో 4,380 కొత్తగా ఏర్పడ్డాయి.

– సర్పంచ్, ఉప సర్పంచ్ లకు ఉమ్మడిగా చెక్ పవర్.

– ప్రస్తుతం ఉన్న విధానం (ప్రత్యక్ష పద్దతి)లోనే రాబోయే పంచాయతీ ఎన్నికలు

– గ్రామాల్లో ఇష్టానుసారం లేఔట్లు చేస్తే జరిమానాలు

– ప్రతి రెండు నెలలకు విధిగా గ్రామ సభ నిర్వహించాలి

– అక్రమాలు, అవినీతికి పాల్పడే సర్పంచ్ లపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఉంటుంది

– సర్పంచ్ లు అప్పీల్ చేసుకునేందుకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ట్రిబ్యునల్ ఏర్పాటు

– పాలక మండలికే కార్యనిర్వహక అధికారాలు

– సబార్డినేట్ గానే పంచాయతీ రాజ్ కార్యరద్శి

– ఇకపై రాష్ట్రంలో నగర పంచాయతీలు అనేవి ఉండవు

– మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి 147 ఉంటాయి

– రైతు సమన్వయ సమితులకు పంచాయతీ రాజ్‌కి సంబంధం లేదు

–  ప్రతీ గ్రామానికి ఒక నర్సరీ ఉండాలి. మొక్కలు పెంచని సర్పంచ్‌ తొలగింపు. నాటిన మొక్కల్లో 85 శాతం చనిపోతే పంచాయతీ సెక్రటరీ తొలగింపు
– ఇక నుంచి పంచాయతీలకు బడ్జెట్‌లో రూ.1500 కోట్లు కేటాయింపు తప్పనిసరి

– రాష్ట్రంలో తండాలు అన్నీ కూడా గ్రామ పంచాయతీగా మారిపోయాయి. 300 మంది జనాభా ఉంటే చాలు పంచాయతీగా ఏర్పాటు

Posted in Uncategorized

Latest Updates