తెలుసుకోండి : సిటీలో ట్రాఫిక్ డైవర్షన్స్ ఇలా ఉన్నాయి

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా రెండు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్స్ ఇచ్చారు ట్రాఫిక్ పోలీసులు. జగన్నాథ రథయాత్ర, బోనాలు, ఆలయాల్లో జాతరల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో మళ్లింపు ఉంటుందని ప్రకటించారు. బల్కంపేటలో ఈనెల 16, 17, 18 తేదీల్లో ఎల్లమ్మ, పోచమ్మ కల్యాణోత్సవాన్ని పురస్కరించుకుని.. జూలై 14వ తేదీ శనివారం నుంచే ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లోకి తెచ్చారు.

… ఫతేనగర్‌ వైపు నుంచి అమీర్‌పేట వెళ్లే వాహనాలు బల్కంపేట శ్మశానవాటిక ఎదురుగా ఉన్న లింకు రోడ్డు మీదుగా బేగంపేట వైపు వెళ్లాలి.

… అమీర్‌పేట వైపు వెళ్లే కార్లు, బైక్స్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయం సమీపంలో.. కుడి వైపునకు తిరిగి బీకేగూడ, ఎస్సార్‌నగర్‌ కమ్యూనిటీ హాల్‌, పోలీస్‌స్టేషన్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

… అమీర్‌పేట వైపు నుంచి వచ్చే భారీ వాహనాలు సత్యం థియేటర్‌ నుంచి లెఫ్ట్ తీసుకుని మైత్రీవనం చౌరస్తా మీదుగా ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ వైపు వెళ్లాలి.

… ఫతేనగర్‌ వైపు ప్రయాణించే భారీ వాహనాలు బేగంపేట, లింకు రోడ్డు మీదుగా బల్కంపేట, ఫతేనగర్‌ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది.

… సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌లోని జగన్నాథ ఆలయం నుంచి రథ యాత్ర ఉంది. దీంతో కందోజు బజార్‌, ఎంజీ రహదారి, రాణిగంజ్‌ జంక్షన్, గస్మండి కూడలి, మహంకాళి వీధి, మహంకాళి ఆలయం, సుఖ్‌దేవ్‌ జాజు దుకాణం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంది.

… బంజారాహిల్స్‌ రోడ్‌ నెం. 12లోని జగన్నాథ్‌ ఆలయం, సీతారాంబాగ్‌లోని జగన్నాథ్‌ ఆలయం, షాహినాత్‌గంజ్‌ మార్వాడీ స్కూల్‌ సమీపంలో ఉన్న జగన్నాథ్‌ మఠం ప్రాంతాల్లో రథయాత్ర ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది.

… ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, టీటీడీ ఆలయం, బషీర్‌బాగ్‌, నాంపల్లి పబ్లిక్‌ గార్డెన్స్‌ వరకు కూడా రథయాత్ర ఉంటుంది. వాహనదారులు ముందుగానే ఆయా ప్రాంతాల వైపు రాకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు ట్రాఫిక్ పోలీసులు.

…  కోఠి ఉమెన్స్‌ కాలేజీ, ఎస్‌బీఆర్‌ క్రాస్‌ రోడ్, బడిచౌడి, హరిద్వార్‌ హోటల్‌,  క్రేజీ కార్నర్‌, ఇసామియా బజార్‌ ప్రాంతాల్లోని రథయాత్ర సాగుతుంది.

… శాలిబండ జగన్నాథ్‌ ఆలయం, లాల్‌దర్వాజ, నాగులచింత కూడలి, వెంకట్‌రావు స్కూల్‌, పంచముఖి హనుమాన్‌ ఆలయం ప్రాంతాల్లోనూ రథయాత్ర ఉంటుంది.

Posted in Uncategorized

Latest Updates