తేజ్ ఐలవ్ యు: ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా

TEJలవ్ స్టోరీస్ ఎక్స్ పర్ట్ కరుణాకరణ్ డైరెక్షన్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన సినిమా తేజ్ I LOVE U. ఈ మూవీ ట్రైలర్ ను సోమవారం (జూన్-25)న రిలీజ్ చేసింది సినిమా యూనిట్. సాయి ధరమ్ తేజ్ సరసన అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది.

2 నిమిషాల ఈ ట్రైలర్ లో అమ్మాయాలను పడేయటం చాలా ఈజీ..ఓ మూడు రోజులు ఆ అమ్మాయి చుట్టు తిరుగూ, ఆ అమ్మాయి చూసినా.. నువ్వు చూడకు. అప్పుడు డిస్ట్రబ్ అవుద్ది చూడు అనే డైలగ్ ఆకట్టుకుంటుంది. నన్ను ప్రేమించడానికి ఇంత మోసం చేస్తావా.. అసలు ఇదంతా నిజమని నమ్మి, నేను నిన్ను ప్రేమిస్తే.. అలాంటి ప్రేమను ఏం చేస్తావ్‌ అంటూ అనుపమ తన బాధను సాయిధరమ్‌ తో చెప్పే డైలాగ్ బాగుంది.

అనుపమా గ్లామర్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చూస్తుంటే కరుణాకరణ్ స్టైల్ కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్‌, లుక్స్‌, పాటలకు పాజిటివ్‌ కామెంట్సే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వచ్చిన  ఈ సినిమా ట్రైలర్‌ లో సాయి ధరమ్‌ తేజ్‌, అనుపమా పరమేశ్వరన్‌ జంటకు మంచి మార్కులే పడుతున్నాయి. గోపి సుందర్‌ అందించిన మ్యూజిక్ గుడ్.  క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌ పై కేఎస్‌ రామారావు నిర్మించిన ఈ సినిమా జూలై 6న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.


Posted in Uncategorized

Latest Updates